TS Highcourt: పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ కూల్చివేతపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-10-17T19:39:31+05:30 IST
నగరంలోని పంజాగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై సోమవారం హైకోర్టు (High court)లో విచారణ జరిగింది. భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో తొలగించడంపై హైకోర్టులో న్యాయవాది రాపోల్ భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.