ఢిల్లీకి గవర్నర్ తమిళిసై

ABN , First Publish Date - 2022-04-06T03:30:16+05:30 IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లికి బయలు దేరి వెళ్లారు. సోమవారం వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ...

ఢిల్లీకి గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లికి బయలు దేరి వెళ్లారు. సోమవారం వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అప్పుడు రద్దు అయింది. తాజాగా మరోసారి తమిళిసై ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆమె హస్తినకు వెళ్లారు.  కేంద్రమంత్రి అమిత్ షాతో తమిళిసై బుధవారం భేటీ కానున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

Read more