Telangana అసెంబ్లీ వద్ద అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-03-12T19:13:50+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. అసెంబ్లీ గేట్ నంబర్ ఒకటి దగ్గర ఉన్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా అగ్ని ప్రమాద ఘటనతో అసెంబ్లీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.