టాస్క్‌ ఫోర్స్‌లను రద్దు చేయాలి: టీచర్లు

ABN , First Publish Date - 2022-11-25T03:54:15+05:30 IST

ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించడానికి ప్రభుత్వం డిస్ర్టిక్ట్‌ అకడమిక్‌ టాస్క్‌ ఫోర్స్‌(డీఏటీఎ్‌ఫ)లను ఏర్పాటు చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి.

టాస్క్‌ ఫోర్స్‌లను రద్దు చేయాలి: టీచర్లు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించడానికి ప్రభుత్వం డిస్ర్టిక్ట్‌ అకడమిక్‌ టాస్క్‌ ఫోర్స్‌(డీఏటీఎ్‌ఫ)లను ఏర్పాటు చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. టాస్క్‌ ఫోర్స్‌లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. టాస్క్‌ ఫోర్స్‌లు ప్రతీ నెలలో ఒకసారి ప్రత్యేకంగా సమావేశమై ఫౌండేషన్‌ లిటరసి అండ్‌ న్యూమరసి(ఎ్‌ఫఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని సమీక్షించి కలెక్టర్‌కు నివేదికను అందించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలిస్తున్నారని, టాస్క్‌ ఫోర్స్‌లో ఎన్‌జీవోలను సభ్యులుగా చేర్చడం ఉపాధ్యాయులను అవమానించడమేనని అన్నారు.

Updated Date - 2022-11-25T03:54:15+05:30 IST

Read more