నేటి నుంచి పద్దులపై చర్చ

ABN , First Publish Date - 2022-03-10T08:46:37+05:30 IST

శాసనసభలో గురువారం నుంచి శాఖల పద్దులపై చర్చ ప్రారంభం కానుంది.

నేటి నుంచి పద్దులపై చర్చ

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో గురువారం నుంచి శాఖల పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. సమాచార, పౌర సంబంధాలు, ఐటీ, మునిసిపల్‌, పరిశ్రమల అభివృద్ధి శాఖలకు సంబంధించి బడ్జెట్‌ పద్దులపై చర్చ నిర్వహించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయం యథాతథంగా కొనసాగుతుంది. ఇటీవల మరణించిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డిలకు సభ సంతాపం ప్రకటించనుంది. శాసన మండలిలో కూడా గురువారం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభమైంది. ఉద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి హరీ్‌షరావు సమాధానాలిచ్చారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు చర్చ ముగిసింది. ఆ తర్వాత సభను స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి గురువారానికి వాయిదా వేశారు.

Updated Date - 2022-03-10T08:46:37+05:30 IST