ఆ మంత్రిని అరచేతిలో పెట్టుకోవడానికే కేసీఆర్ డ్రామాలు: స్వామి గౌడ్

ABN , First Publish Date - 2022-04-16T22:22:57+05:30 IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని అరచేతిలో పెట్టుకోవడానికే తనపై హత్య ప్రయత్నం చేయించినట్లు కేసీఆర్ డ్రామాలు ఆడి కేసులు..

ఆ మంత్రిని అరచేతిలో పెట్టుకోవడానికే కేసీఆర్ డ్రామాలు:  స్వామి గౌడ్

జోగులాంబ గద్వాల: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని అరచేతిలో పెట్టుకోవడానికే తనపై హత్యప్రయత్నం చేయించినట్లు కేసీఆర్ డ్రామాలు ఆడారని బీజేపీ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర శనివారం ఉండవెళ్లి మండలం మారమునుగాల దగ్గరకు చేరుకుంది. పాదయాత్ర విరామ సమయంలో స్వామి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘కష్టాలు చెప్పుకోవడానికి బీజేపీ పాదయాత్రతో  వచ్చిందని ప్రజలు సంతోషిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు... ఆర్డీఎస్ కోసం పాటు పడతామని చెప్పిన ఆ నాటి ఉద్యమకారుడు కేసీఆర్ ఇప్పడు ఎక్కడ ఉన్నారు.. 

 ఈ నాటికి ఆర్డీఎస్ ను పట్టించుకోకపోవడం బాధాకరం.. పాదయాత్రలో రైతుబంధు గురించి రైతులను అడిగితే.. ఉన్నోడికే రైతుబంధు అని చెపుతున్నారు.కొంతమంది ఓర్వలేక బీజేపీ యాత్రను తొండియాత్ర అంటున్నారు.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బీజేపీ గ్రామస్థాయిలోకి వెళ్తుంది..బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను ఓర్వలేక మా పై దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు.. రాళ్లతో దాడి చేసిన శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తాం’’ అని స్వామి గౌడ్ పేర్కొన్నారు.


Updated Date - 2022-04-16T22:22:57+05:30 IST