నాగోల్ ఆస్పత్రిలో యువకుడి అనుమానాస్పద మృతి.. బంధువుల ఆందోళన

ABN , First Publish Date - 2022-01-11T03:38:30+05:30 IST

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ యువకుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యాదగిరి.. కాసేపటికే మృతి చెందడం వివాదాస్పదమైంది..

నాగోల్ ఆస్పత్రిలో యువకుడి అనుమానాస్పద మృతి.. బంధువుల ఆందోళన

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ యువకుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యాదగిరి.. కాసేపటికే మృతి చెందడం వివాదాస్పదమైంది. మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. వైద్యులు అందుబాటులో లేకుండానే ఆస్పత్రి నిర్వహిస్తున్నారన్నారు. సమయానికి డాక్టర్లు ఉండి ఉంటే తమ వాడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-11T03:38:30+05:30 IST