ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌, చైన్‌మన్‌

ABN , First Publish Date - 2022-12-07T03:51:11+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మంగళవారం ఓ సర్వేయర్‌, చైన్‌మన్‌ ఏసీబీకి చిక్కారు. రెబ్బెన తహసీల్దార్‌ కార్యాలయంలో మండల ఇన్‌చార్జి సర్వేయర్‌ గుణవంతరావు, చైన్‌మన్‌ గణపతి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌, చైన్‌మన్‌

రైతు నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

రెబ్బెన, డిసెంబరు 6: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మంగళవారం ఓ సర్వేయర్‌, చైన్‌మన్‌ ఏసీబీకి చిక్కారు. రెబ్బెన తహసీల్దార్‌ కార్యాలయంలో మండల ఇన్‌చార్జి సర్వేయర్‌ గుణవంతరావు, చైన్‌మన్‌ గణపతి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ జిల్లా చేగుర్తి గ్రామానికి చెందిన రైతు గాండ్ల శంకరయ్యకు తుంగెడ శివారులో సర్వే నంబరు 128/సీలో 10 ఎకరాల స్థలం ఉంది. దాన్ని ఆయన ఇటీవల సర్వే చేయించాడు. పంచనామా కాపీకి రూ.20 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్‌, చైన్‌మన్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని శంకరయ్య ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మంగళవారం అతని నుంచి చైన్‌మన్‌ గణపతి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Updated Date - 2022-12-07T03:51:12+05:30 IST