పోలవరంపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
ABN , First Publish Date - 2022-12-16T03:18:16+05:30 IST
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ ఉల్లంఘనలతో పాటు కొత్త
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ ఉల్లంఘనలతో పాటు కొత్త కాంపోనెంట్లు చేర్చడం, ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల సంఖ్య పెంపు వంటి అంశాలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లా రావు తొలుత జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)లో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ అంశాలను కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి నివేదించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అనేక ఉల్లంఘనలు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది కే శ్రవణ్ కుమార్ తెలిపారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం ప్రాజెక్టులపై పెండింగ్‌లో ఉన్న కేసులకు ఈ పిటిషన్‌ను జత చేసింది.