రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ

ABN , First Publish Date - 2022-04-24T12:31:06+05:30 IST

జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల అనంతరం శిబిరాలు తిరిగి మొదలవుతున్నాయి. మే 31వ తేదీ వరకు

రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల అనంతరం శిబిరాలు తిరిగి మొదలవుతున్నాయి. మే 31వ తేదీ వరకు 6 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని 854 ఆట స్థలాల్లో 44 క్రీడల్లో శిక్షణ కోసం ఏర్పాట్లు చేసినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు www.sports.ghmc.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. షటిల్‌, బ్యాడ్మింటన్‌, రోలర్‌ స్కేటింగ్‌, క్రికెట్‌, టెన్నిస్‌ క్రీడలకు రూ.50, ఇతర క్రీడలకు రూ.10 నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం ఉదయం 7 గంటలకు విక్టరీ ప్లే గ్రౌండ్‌లో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి శిబిరాలను ప్రారంభిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఉంటుంది. శిబిరాల కోసం అవసరమైన క్రీడా సామగ్రిని జీహెచ్‌ఎంసీ సిద్ధం చేసింది. 44 క్రీడలకు సంబంధించి రూ.1.20 కోట్లతో మెటీరియల్‌ కొనుగోలు చేశారు. 800 మంది కోచ్‌లు అందుబాటులో ఉండనున్నారు. నైపుణ్యం ఉన్న క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడేలా ప్రోత్సహిస్తామని క్రీడా విభాగం అధికారొకరు తెలిపారు.

Updated Date - 2022-04-24T12:31:06+05:30 IST