కింగ్‌కోఠి ప్యాలెస్‌ కేసులో సుఖేశ్‌ గుప్తాకు ఊరట

ABN , First Publish Date - 2022-11-25T03:53:22+05:30 IST

కింగ్‌ కోఠి ప్యాలెస్‌ కేసులో నగల వ్యాపారి సుఖేశ్‌ గుప్తాకు హైకోర్టులో ఊరట లభించింది.

కింగ్‌కోఠి ప్యాలెస్‌ కేసులో సుఖేశ్‌ గుప్తాకు ఊరట

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కింగ్‌ కోఠి ప్యాలెస్‌ కేసులో నగల వ్యాపారి సుఖేశ్‌ గుప్తాకు హైకోర్టులో ఊరట లభించింది. తమకు తాకట్టు పెట్టిన కింగ్‌ కోఠి ప్యాల్‌సను తమకు తెలియకుండా విక్రయించారని శ్రేయి ఎక్వి్‌పమెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసును కొట్టేయాలని ఇందులో నిందితులుగా ఉన్న సుఖేశ్‌గుప్త, నీతూ గుప్త, సి. రవీంద్రన్‌, పి. సురేశ్‌కుమార్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె. సురేందర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదం పూర్తిగా సివిల్‌ వ్యాపార లావాదేవీలకు సంబంధించినదని, దీనికి క్రిమినల్‌ సెక్షన్ల కింద కేసు పెట్టడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-11-25T03:53:23+05:30 IST