ప్రేమ పెళ్లి.. అయినా వేధింపులే..

ABN , First Publish Date - 2022-05-30T05:56:03+05:30 IST

ప్రేమ పెళ్లి.. అయినా వేధింపులే..

ప్రేమ పెళ్లి.. అయినా వేధింపులే..

 వివాహమైన నెలన్నర రోజులకే యువతి ఆత్మహత్య

 భర్త వైఖరే కారణమని సూసైడ్‌ నోట్‌

 ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు 

కాటారం, మే 29 : వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలయకుండా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరైనా ఒకటయ్యారు. తమ కూతురు ప్రేమ పెళ్లికి అభ్యంతరం చెప్పి తల్లిదండ్రులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఇద్దరు సుఖసం తోషాలతో జీవిస్తే చాలనుకున్నారు. ఇంతలోనే ఆ ఇంట పెను విషాదం అలుమకుంది. పెళ్లయిన నెలన్నర గడవకముందే కూతురు పురుగుల మందు తాగింది. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి చివరి శ్వాస విడిచింది. భర్త వేధింపులే తన చావుకు కారణమని ఆ యువతి సూసైడ్‌ నోట్‌ రాయడంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. అతడిని తమ కళ్లెదుటే శిక్షించాలని డిమండ్‌ చేశారు. భూపాలపల్లి జిల్లాలో ఈ ఘటన చోటుచే సుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్సై దాసరి సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

మహాముత్తారం మండలం యామన్‌పల్లికి చెందిన బొచ్చు విజయ(25), కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ ప్రే మించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతనెల వీరిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం శ్రీకాంత్‌ తల్లిదండ్రుల తో కలిసి ఒడిపిలవంచలో కాపురం పెట్టారు. ఇంతలోనే శ్రీకాంత్‌ అసలు రంగు బయట పడింది. పెళ్లయిన వారం రోజులు  తిరక్కుండానే మద్యం తా గొచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన విజయ జీవితంపై విరక్తి కలిగి ఈనెల 24న పురుగుల మందు తాగింది. దీనికి ముందు తన చావుకు భర్త వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం రాత్రి విజయ మృతి చెందింది. మృతురాలి అన్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. 

మృతురాలి బంధువుల ఆందోళన

ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయను నెలన్నర రోజులు గడవకముందే శ్రీకాంత్‌ పొట్టన పెట్టుకున్నాడంటూ ఆమె తల్లిదండ్రులు, బంఽధువులు ఆదివారం ఆందోళనకు దిగారు. శ్రీకాంత్‌ను తమ కళ్లెదుటే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని న్యాయం చేస్తామన్నారు. అయినా వారు శాంతించలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ రంజిత్‌రావు, ఎస్సై సుధాకర్‌ వారిని సముదాయించారు. శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మాటి చ్చారు. దీంతో విజయ కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. పోస్ట్‌మార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు యామనపల్లికి తరించారు. విజయ తల్లిదండ్రులు గట్టమ్మ, రామయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడికి ఇప్పటికే పెళ్లయింది.  కూతురు విజయ రహస్యంగా వివాహం చేసుకొని ప్రేమించిన వ్యక్తి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. 

Updated Date - 2022-05-30T05:56:03+05:30 IST