కుటుంబకలహాల కారణంగా ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-07T00:54:41+05:30 IST

కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొం దుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పర్వేదుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

 కుటుంబకలహాల కారణంగా ఆత్మహత్య
ధనలక్ష్మి (ఫైల్‌)

కుటుంబకలహాల కారణంగా ఆత్మహత్య

పెద్దవూర, డిసెంబరు 6: కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ చికిత్స పొం దుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పర్వేదుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... పీఏపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన కుంచపు చంద్రయ్య, కళమ్మ దంపతుల కుమార్తె పున్న ధనలక్ష్మి (28) పెద్దవూర మండలం పర్వేదుల గ్రామానికి చెందిన పున్న బ్రహ్మం పదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. పర్వేదుల గ్రామంలో కిరాణ దు కాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి గాయత్రి (8), విఘ్నే్‌ష (6) పిల్లలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి కుటుంబ కలహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో గత నెల 19వ తేదీన పర్వేదులలోని అత్తగారింట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి తల్లి కుంచపు కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పెద్దవూర ఎస్‌ఐ పరమేష్‌ తెలిపారు.

Updated Date - 2022-12-07T00:54:44+05:30 IST