కంప్యూటర్స్‌కే విద్యార్థుల జై...
ABN , First Publish Date - 2022-10-17T09:16:55+05:30 IST
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల వైపే విద్యార్థులు మొగ్గు చూపారు.
- 94శాతం భర్తీ అయిన సీఎ్‌సఈ, ఐటీ
- భారీగా మిగిలిన మెకానికల్, సివిల్
- ఇంజనీరింగ్‌లో ఇంకా 14 వేల సీట్లు ఖాళీ
- ఎంసెట్ రెండో దశ సీట్ల కేటాయింపు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల వైపే విద్యార్థులు మొగ్గు చూపారు. ఎప్పటిలాగే కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చారు. మెకానికల్, సివిల్ తదితర కోర్సులకు డిమాండ్ కొంత తగ్గింది. ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వివరాలను అధికారులు ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మొత్తం 78,336 సీట్లు ఉన్నాయి. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లలో కలిపి ఇప్పటివరకు 64,134 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. అంటే మొత్తం సీట్లలో 81.87 శాతం భర్తీ అయ్యాయి. ఇంకా సుమారు 14,202 సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. సీట్లు పొందిన అభ్యర్థులు మంగళవారం (ఈ నెల 18వ తేదీ)లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఈడబ్ల్యుఎస్ కోటా కింద 5,265 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. అలాగే... ఆప్షన్లు నమోదు చేసుకున్నవారిలో సుమారు 4,590 మందికి ఎక్కడా సీట్లు లభించలేదు. అంటే ఆయా విద్యార్థులు కోరుకున్న కాలేజీల్లో సీట్లు భర్తీ కావడంతో వారికి అవకాశం రాలేదు.
రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మొత్తం 33 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో ఒకటి యూనివర్సిటీ కాలేజీ కాగా, మిగిలిన 32 కాలేజీలు ప్రైవేట్‌వి కావడం గమనార్హం. అలాగే 100 శాతం సీట్లు నిండిన కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ టెలిమాటిక్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇంటెగ్రేటెడ్ బీకెట్-ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు ఉన్నాయి. కాగా, ఈ ఏడాదికి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎ్‌ఫఆర్‌సీ) ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.