15వ ఆర్థికసంఘం సలహాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ

ABN , First Publish Date - 2022-01-23T08:51:12+05:30 IST

మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌కు కేంద్ర పరిధిలోని 15వ ఆర్థికసంఘం ఇచ్చే సలహాలు, సూచనల అమలుకు, ఆ కార్యక్రమ నిర్వహణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

15వ ఆర్థికసంఘం సలహాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌కు కేంద్ర పరిధిలోని 15వ ఆర్థికసంఘం ఇచ్చే సలహాలు, సూచనల అమలుకు, ఆ  కార్యక్రమ నిర్వహణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం సూచనల మేరకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా పర్యావరణ శాఖ ఎస్‌సీఎస్‌, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైౖర్మన్‌, రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి, రాష్ట్ర చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ ప్రతినిధి, సీడీఎంఏ ఉంటారు.

Read more