యువతిని మోసం చేసిన ఎస్సై అరెస్టు

ABN , First Publish Date - 2022-08-04T09:41:47+05:30 IST

దేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తూ.. ఆమెను కాకుండా వేరొక యువతిని పెళ్లి చేసుకున్న ‘ఖాకీ’ కటకటాలపాలయ్యాడు.

యువతిని మోసం చేసిన ఎస్సై అరెస్టు

బాధితురాలి ఫిర్యాదుతో.. 28రోజుల తర్వాత చర్యలు 

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 3: పదేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తూ.. ఆమెను కాకుండా వేరొక యువతిని పెళ్లి చేసుకున్న ‘ఖాకీ’ కటకటాలపాలయ్యాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్‌ విజయ్‌కు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన యువతితో సహజీవనం చేస్తూ మరో పెళ్లి చేసుకున్నాడు. విజయ్‌కు వివాహమై బిడ్డ పుట్టాడని తెలుసుకున్న ఆమె.. నిలదీయడంతో రెండో భార్యగా తనతో ఉండాలని సూచించాడు. బాధితురాలు తల్లిదండ్రుల వద్దకు వచ్చేయగా వారు ఆమెకుపెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న విజయ్‌ పెళ్లి సంబంఽధాలు చెడగొట్టేవాడు. ఈ విషయాలన్నీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గత నెల 10న విజయ్‌ని ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ చేశారు. 28 రోజుల తర్జనభర్జనల అనంతరం చివరకు విజయ్‌ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2022-08-04T09:41:47+05:30 IST