TS News: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లో పేల్చిన శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2022-08-13T22:03:50+05:30 IST
ఫ్రీడమ్ ర్యాలీ (freedom rally)లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) హల్చల్ చేశారు. పోలీసుల నుంచి తుపాకీ తీసుకుని గాల్లో పేల్చారు.

మహబూబ్‌నగర్: ఫ్రీడమ్ ర్యాలీ (freedom rally)లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) హల్చల్ చేశారు. పోలీసుల నుంచి తుపాకీ తీసుకుని గాల్లో పేల్చారు. ఎస్ఎల్ఆర్ వెపన్తో గాల్లోకి మంత్రి కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌గౌడ్ కాల్పుల వీడియో సోషల్‌మీడియా (Social media)లో వైరల్ అవుతోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అయితే మాత్రం గాల్లో కాల్పులు జరుపుతారా అని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీలో నిర్వహించారు. ర్యాలీ ప్రారంభించే ముందు ఎస్పీ వెంకటేశ్వర్లు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ వెపన్‌ను శ్రీనివాస్‌గౌడ్‌కు ఇచ్చారు. గౌరవపదంగా ఆయన గాలిల్లో కాల్పులు జరిపారు. నిబంధలను విరుద్ధంగా ఎస్పీ తుఫాకి ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా మంత్రి కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసులు మంత్రికి గన్ ఇవ్వడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ర్యాలీలో మంత్రికి గన్ ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్‌గౌడ్ ఫైరింగ్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన వివరణ ఇచ్చారు. తాను రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని తెలిపారు. తనకు ఎస్పీనే తుపాకీ ఇచ్చారని, తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్లు అని తెలిపారు. స్పోర్ట్స్ మీట్స్‌లో ఇలా కాల్చడం సహజమేనని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.