నీట్‌ ఫలితాల్లో శ్రీచైతన్యదే అగ్రస్థానం

ABN , First Publish Date - 2022-09-09T09:56:38+05:30 IST

హైదరాబాద్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): నీట్‌ ఫలితాల్లో తమ సంస్థ అగ్రస్థానం సాధించిందని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 5వ ర్యాంకు (ఎర్రబెల్లి సిద్ధార్థరావు), 7వ ర్యాంకు (అర్పిత్‌ నారంగ్‌), 8వ ర్యాంకు (కృష్ణ ఎస్‌.ఆర్‌)తోపాటు అన్ని కేట

నీట్‌ ఫలితాల్లో శ్రీచైతన్యదే అగ్రస్థానం

హైదరాబాద్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): నీట్‌ ఫలితాల్లో తమ సంస్థ అగ్రస్థానం సాధించిందని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో 5వ ర్యాంకు (ఎర్రబెల్లి సిద్ధార్థరావు), 7వ ర్యాంకు (అర్పిత్‌ నారంగ్‌), 8వ ర్యాంకు (కృష్ణ ఎస్‌.ఆర్‌)తోపాటు అన్ని కేటగిరీల్లో 2వ ర్యాంకు (జాదవ్‌ వరద్‌ వైభవ్‌), 3 ర్యాంకు (గుల్ల హర్షవర్ధన్‌ నాయుడు)లు సాధించిన వారు తమ విద్యా సంస్థలోనే చదివారని పేర్కొన్నారు. ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ 100లోపు 17 ర్యాంకులు, అన్ని కేటగిరీల్లో కలిపి 100లోపు 69 ర్యాంకులను సాధించినట్లు వెల్లడించారు. నిష్టాతులైన ఫ్యాకల్టీతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఇలాంటి ఫలితాలు సాధించగలిగామని వివరించారు.

Read more