కోలాహలంగా స్ర్పింట్స్‌ అథ్లెటిక్స్‌

ABN , First Publish Date - 2022-06-17T06:05:33+05:30 IST

కోలాహలంగా స్ర్పింట్స్‌ అథ్లెటిక్స్‌

కోలాహలంగా స్ర్పింట్స్‌ అథ్లెటిక్స్‌
జేఎన్‌ఎస్‌లో పరుగుపందెం పోటీలో పాల్గొన్న అథ్లెట్లు

33 జిల్లాల నుంచి 472 మంది క్రీడాకారుల హాజరు

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ రంగారెడ్డి జిల్లా కైవసం

త్వరలో మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌: చీఫ్‌విప్‌ వినయ్‌

హనుమకొండ, స్పోర్ట్స్‌, జూన్‌ 16: అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గురువారం రాష్ట్ర స్ధాయి స్ర్పింట్స్‌ ఆల్‌ ఏజ్‌ ఆఽఽథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు కోలాహలంగా జరిగాయి.   రంగారెడ్డి ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈప్రారంభ కార్యక్రమానికి చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ది కోసం త్వరలోనే జిల్లాలోని ఉన్నతాఅధికారులతోపాటు వివిధ క్రీడాసంఘాల బాధ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.  సీఎం కేసీఆర్‌ క్రీడాకారుల కోసం రాష్ట్రంలో మెరుగైన క్రీడా మైదానాలు నిర్మించడంతో పాటు క్రీడల అభివృద్ధి కోసం క్రీడా కమిటీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలో క్రీడా సంఘాల సమన్వయంతో నగరంలో  మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.  

100, 200, 300, 400 మీటర్ల బాల బాలికల, మెన్‌ అండ్‌ ఉమెన్‌ (ఆల్‌ ఏజ్‌) విభాగాల్లో పరుగుపందెం పోటీలను ఒక్క రోజు పాటు నిర్వహించగా,  రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 472 మంది క్రీడాకారులతో పాటు 20 మంది టెక్నికల్‌ అఫిషీయల్స్‌, కోచ్‌లు పాల్గొన్నారు.  సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలుగా నిర్వాహకులు బహుమతులను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 

ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అశోక్‌కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోశాధికారి బి.కైలా్‌సయాదవ్‌, షైన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ మూగల కుమార్‌యాదవ్‌, రామప్ప పోలీస్‌ అకాడమీ చైర్మన్‌ ఐలి చంద్ర మోహన్‌గౌడ్‌, అసోసియేషన్‌ బాధ్యులు పాల్గొన్నారు.

ఓవరాల్‌ చాంపియన్‌ రంగారెడ్డి జిల్లా 

అండర్‌-12, 14, 16, 18, 20, మెన్‌ అండ్‌ ఉమెన్‌ 100, 200, 300, 400 మీటర్ల స్ర్పింట్‌ పరుగుపందెంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటాపోటీగా పాల్గొన్నారు.  వివిధ విభాగాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 49పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప కైవసం చేసుకున్నారు. ద్వితీయ స్థానంలో ఖమ్మం, తృతీయ స్థానంలో నల్గొండ జిల్లాలు నిలిచాయి.

Updated Date - 2022-06-17T06:05:33+05:30 IST