క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
ABN , First Publish Date - 2022-10-17T05:59:49+05:30 IST
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కైలాష్‌యాదవ్
ఖిలావరంగల్, అక్టోబరు 16: క్రీడాకారులు క్రీడల్లో భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో రాణించాలని ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బైరబోయిన కైలాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ఖిలావరంగల్ మధ్యకోటలో రాష్ట్ర స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ రోడ్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు కోచ్‌ల నుంచి ఉత్తమ శిక్షణను పొంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని అన్నారు. క్రీడాకారులకు భవిషత్‌లో మంచి గ ుర్తింపు ఉందన్నార ు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు నవంబరు 1 నుంచి 5 వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకార ులకు మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్‌వో ఇందిర, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, స్కేటింగ్ కోచ్‌లు, క్రీడాకారులు సిద్దార్థ, జోయేల్, హర్ష, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.