వేర్వేరు ప్రాంతాలకు ఆరు Special trains

ABN , First Publish Date - 2022-09-25T13:02:41+05:30 IST

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు సెస్టెంబర్‌ 25, 26, 27, 28 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు

వేర్వేరు ప్రాంతాలకు ఆరు Special trains

హైదరాబాద్‌: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు సెస్టెంబర్‌ 25, 26, 27, 28 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 25న సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు(07469), 26న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు(07470), 25, 27 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైలు(07233), 26, 28 తేదీల్లో యశ్వంత్‌పూర్‌-హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు(07234), 26న నాందేడ్‌ నుంచి పూరి ప్రత్యేక రైలు(07565), 27న పూరి నుంచి నాందేడ్‌కు ప్రత్యేక రైలు(07566) నడుపుతున్నట్టు వారు తెలిపారు. 


తొమ్మిది రైళ్ల రద్దు: సెప్టెంబర్‌ 25న వివిధ ప్రాంతాల నుంచి నడిచే తొమ్మిది రైళ్లను రద్దు చేసినట్టు  రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ-గుంటూరు(07783), గుంటూరు-మాచర్ల (07779), మాచర్ల-నడికుడి(07580), నడికుడి-మాచర్ల(07579), మాచర్ల-విజయవాడ (07782), డోర్నకల్‌-విజయవాడ (07755), విజయవాడ-డోర్నకల్‌ (07756), భద్రాచలం-విజయవాడ (07278), విజయవాడ-భద్రాచలం (07979) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 

Read more