స్పీకర్ నిర్ణయమే ఫైనల్: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-16T02:08:18+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్

స్పీకర్ నిర్ణయమే ఫైనల్: మంత్రి ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తమ  సస్పెన్షన్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే సృష్టించుకున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నిర్ణయాలను తాము ఎండగడుతామనే వాళ్ళకి తెలిసే సభలో ఉండకూడదు అని నిర్ణయించుకున్నట్టు ఉందన్నారు. ప్రజా సమస్యలపైన మాట్లాడటం బీజేపీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు. కావాలనే వాళ్ళు తోక ముడుచుకొని వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. డ్రామాలు చేస్తూ ఇవాళ మళ్ళీ అసెంబ్లీకి వచ్చారని ఆయన అన్నారు. కానీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. మళ్ళీ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, రాజ్యసభ, లోక్‌సభలో బీజేపీ వాళ్ల్లు కూడా సస్పెండ్ చేస్తున్నారన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదా? ఇక్కడే అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-16T02:08:18+05:30 IST