కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు సోనియా అపాయింట్ మెంట్

ABN , First Publish Date - 2022-04-04T20:49:03+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంత రావు కు సోనియా గాంధీ అపాయింట్మెంట్ లభించింది.

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు సోనియా అపాయింట్ మెంట్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంత రావు కు సోనియా గాంధీ అపాయింట్మెంట్ లభించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వివిధ పరిణామాలను సోనియాకు వివరించేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన వి.హన్మంతరావుకు సోనియా అపాయింట్ లభించలేదు. తాజాగా ఆయనకు సోమవారం సాయంత్రం 5 గంటలకు సోనియా అపాయింట్ మెంట్ లభించింది. వీహెచ్ ప్రత్యేకంగా సోనియాతో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ తో రాష్ట్ర నేతల సమావేశం వుంది. అదే సమయంలో వీహెచ్ కు సోనియాగాంధీ అపాయింట్ మెంట్ లభించింది. సోనియా తో భేటీ తర్వాత... రాహుల్ గాంధీ తో సమావేశమవుతానని వీహెచ్ తెలిపారు. 

Updated Date - 2022-04-04T20:49:03+05:30 IST