కక్కును కరిచిన రక్త పింజర
ABN , First Publish Date - 2022-12-15T00:23:19+05:30 IST
మండలంలోని వెలుగురాళ్ల తండాకు చెందిన ఎస్లావత్ జగన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను బుధవారం రక్తపింజర కాటేసింది.
యాంటీ వీనమ్ ఇంజక్షన్ చేసి కాపాడిన వైద్యుడు
కడ్తాల్, డిసెంబర్ 14: మండలంలోని వెలుగురాళ్ల తండాకు చెందిన ఎస్లావత్ జగన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను బుధవారం రక్తపింజర కాటేసింది. దీంతో కుక్కను రక్షించుకునేందుకు జగన్ వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాడు. పశు వైద్యాధికారి విజయ్‌కుమార్ కుక్కకు యాంటీ వీనమ్ ఇంజక్షన్ చేసి దాన్ని రక్షించారు. కుక్క ప్రాణాలతో బయటపడడంతో యజమాని సంతోషించారు. ఇలాం టి వైద్యం చేయడం అరుదని స్థానికంగా చర్చించుకున్నారు.