జిల్లాఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి : సీతక్క

ABN , First Publish Date - 2022-03-05T18:15:12+05:30 IST

తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..

జిల్లాఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి : సీతక్క

ములుగు : తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. అన్ని జిల్లాలను సమానంగా చూసినప్పుడే తెలంగాణ సమాంతరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అంతే స్థాయిలో నిధులు ఇవ్వాలన్నారు. గిరిజన యూనివర్సిటీపై స్పష్టత ఇవ్వాలని సీతక్క కోరారు.

Read more