ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకు సిట్ మెయిల్..

ABN , First Publish Date - 2022-11-29T09:06:25+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు సిట్ ముందుకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకు సిట్ మెయిల్..

Delhi : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase case)లో నేడు సిట్ ముందుకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju) హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్ (SIT) ఈ మెయిల్ (Email) సందేశం అందించింది. మళ్లీ అవసరం అయితే పిలుస్తామంటూ ఎంపీ రఘురామకు సిట్ తెలిపింది. నిజానికి రఘురామకు మూడు రోజుల క్రితం సిట్ CRPC 41A కింద నోటీసులు జారీ చేసింది. 10:30 కి కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించింది. నిందితులతో రఘురామ ఫొటోస్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. A1, A2 లతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే 41A నోటీస్‌లు అందుకున్న నలుగురిని నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే హాజరుకాని ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కానీ నేడు రఘురామకు మాత్రం విచారణకు అవసరం లేదని తెలిపింది.

Updated Date - 2022-11-29T09:17:13+05:30 IST