వరంగల్‌ వరకే ‘సింగరేణి’

ABN , First Publish Date - 2022-07-05T06:02:25+05:30 IST

వరంగల్‌ వరకే ‘సింగరేణి’

వరంగల్‌ వరకే ‘సింగరేణి’

ఈనెల 20 వరకు ఇదే పరిస్థితి

మూడో లైన్‌ నిర్మాణం కారణంగా మార్పు

గిర్మాజిపేట, జూలై 4 : వరంగల్‌- బల్లార్ష రైల్వే మార్గంలో మూడో లైన్‌ నిర్మాణం కారణంగా ప్రస్తుతం సింగరేణి ఎక్స్‌ ప్రెస్‌ భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్‌ వరకే నడుస్తుందని, రైలు వేళల్లో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు పే ర్కొన్నారు. ఈనెల 20 వరకు సింగరేణి భద్రాచలం రోడ్డు-వ రంగల్‌ మధ్యనే నడుస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాలని వరంగల్‌ రైల్వే అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు. నిత్యం సింగరే ణి భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) నుంచి సిర్పూర్‌ కాగజ్‌న గర్‌ మధ్య నడుస్తోంది. ఈ రైలు కొత్తగూడెంలో ఉదయం 5 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది. వరంగల్‌ నుంచి కాజీపేట మీదుగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు వెళ్తుంది. తిరిగి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి బ యలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు వరంగల్‌కు చేరుకుని అదేరాత్రి 7.50 గంటలకు కొత్తగూడెం చేరుకుంటుంది. అ యితే వరంగల్‌-బల్లార్ష రైల్వే మార్గంలో ఉప్పల్‌, బిజిగిరి షరీష్‌, జమ్మికుంట రైల్వేస్టేషన్‌ల పరిధిలోని మూడో లైన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీని కారణంగా రైల్వేశాఖ గత నెల 27 నుంచి ఈ మార్గంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని కొన్ని స్టేషన్‌లకే పరిమితం చేసింది. ఇందులో భాగంగా సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌ వరకే పరిమితం చేశారు. ఈ రైలు గత నెల 27నుంచి భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్‌కు వచ్చి ఇక్కడి నుంచే తిరిగి భద్రాచలం రోడ్డు వెళ్తోంది. ఉదయం ఈ రైలు రాగానే ప్రయాణికులు దిగిన తరువాత కాజీపేటకు వెళ్లి  అక్కడి నుంచి సాయంత్రం వరంగల్‌కు వచ్చి ఇక్కడి నుంచి భద్రా చలం రోడ్డు వెళ్తోందని అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2022-07-05T06:02:25+05:30 IST