ప్రత్యేక రాష్ట్రంలో గణనీయ పురోగతి

ABN , First Publish Date - 2022-09-30T09:54:47+05:30 IST

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించిందని, గత తెలంగాణ, ప్రస్తుత తెలంగాణలను పోల్చుతూ మరిన్ని పరిశోధనాత్మక రచనలు రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో గణనీయ పురోగతి

తెలంగాణ హిస్టరీ, కల్చర్‌, మూవ్‌మెంట్స్‌.. ఆవిష్కరణలో సీఎస్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించిందని, గత తెలంగాణ, ప్రస్తుత తెలంగాణలను పోల్చుతూ మరిన్ని పరిశోధనాత్మక రచనలు రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అన్నారు. ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ, డాక్టర్‌ ద్యావనవెళ్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్‌, మూవ్‌మెంట్స్‌’ అనే పుస్తకాన్ని బీఆర్కే భవన్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి మూలకూ చరిత్ర ఉందని సీఎం కేసీఆర్‌ చెబుతుంటారని, ఈ పుస్తకంలోని చారిత్రక అంశాలను చూస్తే అది మరోసారి నిరూపితమవుతుందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T09:54:47+05:30 IST