దమ్ముంటే మునుగోడులో BRS పేరుతో పోటీ చేయాలి: ఎంపీ లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-10-07T20:09:19+05:30 IST
దమ్ముంటే మునుగోడులో BRS పేరుతో పోటీ చేయాలని ఎంపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు.
హైదరాబాద్ : దమ్ముంటే మునుగోడులో BRS పేరుతో పోటీ చేయాలని ఎంపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి BRSపై పోటీచేసి గెలవాలని డిమాండ్ చేశారు. రైతులకు బేడీలు వేసినవారు దేశం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్ముతో దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను కించపరించారనన్నారు. ఏపీలో పోటీచేస్తే అక్కడి ప్రజలు బుద్ధి చెప్తారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.