షర్మిల పాదయాత్రను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2022-12-16T03:29:45+05:30 IST

పంజాగుట్ట, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):‘బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలతో చేతులు కలిపిన వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో క్ర్తెస్తవుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాన్ని

షర్మిల పాదయాత్రను అడ్డుకుంటాం

రాష్ట్రాన్ని అస్థిరపర్చేందుకే యత్నం: క్రైస్తవ సంఘాలు

పంజాగుట్ట, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):‘బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలతో చేతులు కలిపిన వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో క్ర్తెస్తవుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాన్ని అస్థిరపర్చేందుకు షర్మిల యత్నిస్తోంది. ఆమె తన పద్ధతిని మార్చుకోకపోతే పాదయాత్రను అడ్డుకుంటాం’ అని పలు క్రైస్తవ సంఘాల నేతలు చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో క్రైస్త్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరుసలెం మత్తయ్య, భారత క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ బిషప్‌ భాస్కర్‌ ముల్కల, తదితరులు విలేకరులతో మాట్లాడారు. దళిత, క్రైస్తవుల ఓట్లను చీల్చి మతతత్వ పార్టీకి మేలు చేయడానికి యత్నిస్తున్న ఆమెను తెలంగాణ క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. షర్మిల బీజేపీచేతిలో కీలుబొమ్మగా మారిందని,తెలంగాణ క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Updated Date - 2022-12-16T03:29:46+05:30 IST