సంక్షేమంపై సోయి లేని సీఎం

ABN , First Publish Date - 2022-11-25T02:44:33+05:30 IST

ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు సోయి లేదని వైఎస్సార్‌టీపీ అఽధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.

సంక్షేమంపై సోయి లేని సీఎం

ఏ ఒక్క పథకమూ సరిగా అందడం లేదు

రాష్ట్రంలో అప్పులేని రైతు అంటూ లేడు

కేసీఆర్‌కు విపక్షాలు అమ్ముడుపోయాయి: షర్మిల

చెల్పూరు, నవంబరు 24: ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు సోయి లేదని వైఎస్సార్‌టీపీ అఽధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నాలు గో రోజూ కొనసాగింది. గురువారం మంజూర్‌నగర్‌ నుంచి ప్రారంభమైంది. 8ఇన్‌క్లైన్‌ రహదారి, బొబ్బలోనిపల్లి, పరుశురాంపల్లి, ధర్మరావుపేట మీదుగా గణపురం చేరుకొంది. ఈ సందర్భంగా ప్రజలతో షర్మిల మాటామంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలన్నింటినీ కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆయన ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అప్పులేని రైతు అంటూ లేడన్నారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు రైతు రుణమాఫీ గుర్తుకొస్తుందని, అధికారం చేపట్టాక ఆ విషయాన్ని విస్మరిస్తారని విమర్శించారు. ముష్టి రూ.5 వేలు ఇచ్చి రైతులను రాజును చేస్తున్నానని అనడం సిగ్గుచేటన్నారు. రూ. 40వేల వ్యవసాయ సబ్సిడీలన్నింటినీ నిలిపివేశారన్నారు. రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు కా వడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజే పీ, కాంగ్రె్‌సలు కేసీఆర్‌కు అమ్ముడు పోయాయని ఆరోపించారు.

వైఎస్సార్‌ పాలన రావాలి

రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌పాలన రావాలని షర్మిల అన్నారు. వైఎస్సార్‌టీపీని ప్రజలు ఆదరించి అధికారం కట్టబెడితే వైఎస్‌ పథకాలన్నింటినీ మళ్లీ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే మొదట యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. నిలువనీడలేని ప్రతి నిరుపేద మహిళ పేరు మీద పక్కా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తామని ఆమె చెప్పారు.

Updated Date - 2022-11-25T02:44:33+05:30 IST

Read more