దాడి చేసిన కేసులో పలువురికి జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-12-30T00:49:23+05:30 IST

దాడిచేసిన వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.500జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

దాడి చేసిన కేసులో పలువురికి జైలు శిక్ష

రామన్నపేట, డిసెంబరు 29: దాడిచేసిన వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.500జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రామన్నపేట ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య తెలిన వివరాల ప్రకారం.. 2014 సంవత్సరంలో మండలంలోని కుంకుడుపాముల గ్రామానికి చెందిన బొక్క పుష్పలతను అదే గ్రామానికి చెందిన బొక్క జగన్మోహన రెడ్డి, బొక్క కృష్ణరెడ్డి, బాసాని లింగమ్మ, బక్క వెంకటరెడ్డి, బొక్క సరోజనలు అడ్డగించి కర్రలతో గాయపరిచారు. ఈ ఘటనపై నాటి ఎస్‌ఐ జి.రాజశేఖర్‌ విచారణ చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ వేయగా, ఏపిపి పి.వెంకటావినాష్‌ ఫిర్యాది తరుపున వాదనలు వినిపించారు. పుష్పలతను అడ్డగించి కర్రలతో దాడి చేసి గాయపరిచిన పలువురికి స్థానిక సివిల్‌ కోర్టు న్యాయమూర్తి చందన రెండేళ్లు జైలు శిక్ష రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Updated Date - 2022-12-30T00:49:23+05:30 IST

Read more