కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్‌ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-03-05T00:16:29+05:30 IST

సీఎం కేసీఆర్‌పై ఆప్‌ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతిలో కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్‌ ఎమ్మెల్యే

ఢిల్లీ: సీఎం కేసీఆర్‌పై ఆప్‌ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతిలో కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులను, యువతను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ‘‘దళితుల ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. దేశంలోని ప్రతి పార్టీ ఒక వ్యక్తిగత ఎజెండాతో ఉన్నాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకమైన ఫ్రంట్ దేశంలో అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేసే ఫ్రంట్ కావాలి. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారు’’ అని సోమ్నాథ్‌ ఆరోపించారు.

Read more