ఆవుల సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

ABN , First Publish Date - 2022-06-25T18:30:30+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆవుల సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆవుల సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆవుల సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవుల సుబ్బారావు 2011లో ఆర్మీలో పనిచేశాడని, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ అతడికి బాగా తెలుసని పోలీసులు తెలిపారు. 2014లో సాయిడిఫెన్స్‌ అకాడమీ ప్రారంభించిన సుబ్బారావు, ఆర్మీలో సెలెక్ట్‌ అయిన తర్వాత ఉద్యోగుల దగ్గర రూ.3 లక్షలు వసూలు చేస్తున్నాడు. అభ్యర్థుల టెన్త్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. 2019 ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టాడని, ఏఆర్‌వో ఆఫీస్‌ దగ్గర ధర్నాకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్‌ బ్లాక్‌, ఇండియన్‌ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్‌ గ్రూప్‌, చలో సికింద్రాబాద్‌ ఏఆర్‌వో గ్రూప్‌, ఆర్మీ జీడీ 2021 మార్చ్‌ ర్యాలీ, సీఈఈ సోల్జర్‌ గ్రూప్‌, సోల్జర్స్‌ టు డై పేరిట గ్రూపులు పెట్టాడు. బీహార్‌లో జరిగినట్టుగానే రైళ్లను తగలబెట్టాలని సూచించాడు. సుబ్బారావు తరపున అతడి అనుచరుడు శివ నిత్యం అభ్యర్ధులతో టచ్‌లో ఉన్నాడు. శివ ఆదేశాల మేరకే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-25T18:30:30+05:30 IST