సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో Yoga దినోత్సవం...పాల్గొన్న ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-06-21T13:41:25+05:30 IST

నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా(Yoga) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో Yoga దినోత్సవం...పాల్గొన్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా(Yoga) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah naidu), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan reddy) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... యోగా యూనిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యాన్నిస్తుందని తెలిపారు. ప్రస్తుత జనరేషన్ కూడా యోగాను చేయాలని అన్నారు. యోగా అంటే ఇంద్రియాలను ఏకం చేయడం, ఆత్మశక్తిని ఏకం చేయడం అని చెప్పుకొచ్చారు. యోగా ప్రాచీనమైనదే అయినా దోషం పట్టనిదన్నారు. యోగాకు కులం, మతం , బ్యారియర్స్ లేవని ఉపరాష్ట్రపతి అన్నారు.


ప్రపంచ వ్యాప్తంగా యోగాను పాపులర్ చేసినందుకు ప్రధాని మోదీకి, యోగాను కనుగొన్న మన పూర్వీకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారని, ఆరోగ్యం ఉంటే భాగ్యం సాధ్యమవుతుందని అన్నారు. ప్రాశ్చాత్య వ్యామోహంతో వచ్చిన మార్పులతో యోగా విశిష్టత మరింత పెరిగిందన్నారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్య వంతం చేద్దామని, యోగా సాధనతో ప్రపంచ శాంతి చేకూర్చుకుందామని పిలుపునిచ్చారు. యోగా స్ట్రెస్, టెన్షన్‌ను పోగొడుతుందన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి యోగా మహోత్సవ్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated Date - 2022-06-21T13:41:25+05:30 IST