‘మా పిల్లలు విధ్వంసంలో పాల్గొనలేదు.. వారికే పాపం తెలియదు’

ABN , First Publish Date - 2022-06-20T19:23:13+05:30 IST

సికింద్రాబాద్(Secunderabad) రైల్వే విధ్వంసం ఘటన కేసుకు సంబంధించిన ఆందోళనకారుల కుటుంబాలు చంచల్ జైల్(Chanchalguda) వద్దకు భారీగా చేరుకున్నారు.

‘మా పిల్లలు విధ్వంసంలో పాల్గొనలేదు.. వారికే పాపం తెలియదు’

సికింద్రాబాద్ : సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటన కేసుకు సంబంధించిన ఆందోళనకారుల కుటుంబాలు చంచల్‌గూడా జైలు(Chanchalguda Jail) వద్దకు భారీగా చేరుకున్నారు. ములఖత్‌లో తమవారిని కలిసి ఆందోళనకారుల తల్లిదండ్రులు కన్నీరమున్నీరు అవుతున్నారు. తమకు ఏ పాపం తెలియదని తల్లిదండ్రులతో యువకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. సమగ్ర దర్యాప్తు చేసి ఎవరు కుట్ర చేశారో తేల్చాలని.. తమ పిల్లలు విధ్వంసంలో పాల్గొనలేదని.. నిరసన కోసం మాత్రమే వచ్చారని  తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉద్యోగం కోసం గత నాలుగు సంవత్సరాలుగా కష్టపడుతున్నారన్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదన్నారు. ప్రభుత్వం కలుగజేసుకొని బెయిల్‌పై విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) కలుగజేసుకొని న్యాయం చెయ్యాలని అరెస్ట్ అయిన యువకుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

గాయపడిన వారిని డిశ్చార్జ్ చేయనున్న గాంధీ వైద్యులు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో గాయపడిన తొమ్మిది మంది యువకులను మరికొద్ది సేపట్లో గాంధీ ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు. వారు డిశ్చార్జ్ అయిన వెంటనే వారిని అరెస్ట్ చేసేందుకు జీఆర్‌పీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులకు జీఆర్పీ పోలీసులు అప్పగించారు. తొమ్మిది మందిని అరెస్టు చేయగా మరో నలుగురు ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-06-20T19:23:13+05:30 IST