అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2022-07-07T09:38:39+05:30 IST

‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి

అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

హైదరాబాద్‌, జులై 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. 8వ విడత హరితహారంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సంబంధిత శాఖలను రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. 8వ విడత హరితహారం పురోగతిపై బుధవారం అరణ్యభవన్‌లో రాష్ట్ర స్థాయి పరిశీలన-సమన్యయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో అటవీ, మునిసిపల్‌, సాగునీటి, పంచాయతీరాజ్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈసారి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. శాఖల వారీగా నిర్ణయించిన మొక్కలు నాటే లక్ష్యాలు, నర్సరీల్లో లభ్యత, అవసరమైన సామగ్రి(ప్లాంటింగ్‌ మెటీరియల్‌), పురోగతిపై సమీక్షా సమావేశంలో చర్చించారు.

Read more