TS News: సంగారెడ్డిలో విషాదం

ABN , First Publish Date - 2022-08-04T13:49:56+05:30 IST

జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది.

TS News: సంగారెడ్డిలో విషాదం

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. మృతులు తల్లి రేఖ (28), కుమార్తె(2), రేఖ మరిది బాసుదేవ్‌ (27)గా గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Read more