ప్రాసిక్యూషన్‌ జేడీగా సాంబశివారెడ్డి

ABN , First Publish Date - 2022-09-10T08:28:19+05:30 IST

హోంశాఖ పరిధిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ)గా ఎస్‌.సాంబశివారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు.

ప్రాసిక్యూషన్‌  జేడీగా సాంబశివారెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హోంశాఖ పరిధిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ)గా ఎస్‌.సాంబశివారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. సాంబశివారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో గ్రేడ్‌-1 అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పదోన్నతి పొందిన ఆయన జేడీగా నియమితులయ్యారు. మరో ఇద్దరు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వి.వెంకటేశ్వర్లు, డి.శ్రీవాణిలకు కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా పదోన్నతి కల్పించారు. నూతన జేడీ సాంబశివరావును డైరెక్టర్‌ వైజయంతి అభినందించారు. 

Read more