587.30అడుగుల వద్ద సాగర్‌ నీటిమట్టం

ABN , First Publish Date - 2022-11-19T00:49:32+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 587.30అడుగుల వద్ద ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 53,846 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదలచేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838టీఎంసీలు)గా ఉంది.

587.30అడుగుల వద్ద సాగర్‌ నీటిమట్టం

నాగార్జునసాగర్‌, నవంబరు 18: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 587.30అడుగుల వద్ద ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 53,846 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదలచేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 10,120 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,325 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 4,101 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 22,146 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 53,846 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.

సుందర కట్టడం బుద్ధవనం

నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సుందర కట్టడమని ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి రాజేంద్రపాల్‌ గౌతమ్‌ అన్నారు. బుద్ధవనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఇక్కడి విశేషాలను ఆయనకు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఆయన వెంట దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జాతీయ అధ్యక్షుడు రవికుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-19T00:49:32+05:30 IST

Read more