సింగరేణిలో రూ.50 వేల కోట్ల స్కాం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-22T22:07:11+05:30 IST

సింగరేణి కోల్‌ మైన్స్‌లో రూ.50 వేల కోట్ల స్కాం జరుగుతోందని టీపీసీసీ

సింగరేణిలో రూ.50 వేల కోట్ల స్కాం: రేవంత్‌రెడ్డి

ఢిల్లీ: సింగరేణి కోల్‌ మైన్స్‌లో రూ.50 వేల కోట్ల స్కాం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. సింగరేణిపై ప్రధానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సింగరేణి స్కాంపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా సీఎండీ శ్రీధర్‌పై డీఓపీటీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణి స్కాంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి గనులు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి అంశంపై ప్రధాని సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు తమ ఫిర్యాదు బదిలీ చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-03-22T22:07:11+05:30 IST