బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.500 కోట్లు
ABN , First Publish Date - 2022-03-05T07:17:37+05:30 IST
వెనుకబడిన తరగతుల(బీసీ), అత్యంత వెనుకబడిన
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : వెనుకబడిన తరగతుల(బీసీ), అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) కో-ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు రూ.250 కోట్ల చొప్పున విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించింది.