మోకాలు, తుంటి మార్పిడికి రోబోటిక్‌ శస్త్రచికిత్సలు

ABN , First Publish Date - 2022-09-19T08:08:49+05:30 IST

మోకాలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సల నిర్వహణకు కొండాపూర్‌, కిమ్స్‌ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

మోకాలు, తుంటి మార్పిడికి రోబోటిక్‌ శస్త్రచికిత్సలు

కొండాపూర్‌ కిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవలు 

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మోకాలు, తుంటి మార్పిడి శస్త్రచికిత్సల నిర్వహణకు కొండాపూర్‌, కిమ్స్‌ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి సీయూఐవీఎస్‌ జాయింట్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ను కిమ్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా కొండాపూర్‌ కిమ్స్‌లో రోబోటిక్స్‌ సాయంతో మోకాలు, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయనున్నామని తెలిపారు. ఈ రోబోటిక్‌ సర్జరీల్లో మిల్లీమీటర్ల స్థాయి వరకూ కచ్చితత్వం ఉంటుందని, దీంతో రోగి త్వరగా కోలుకుంటారని చెప్పారు. హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటులు సుధీర్‌బాబు, చాందినీ చౌదరి, సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ గురువారెడ్డి, కిమ్స్‌ సీఈఓ అద్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-19T08:08:49+05:30 IST