బైక్‎ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-04-24T12:05:15+05:30 IST

శాలిగౌరారం మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంగమర్తి సమీపంలో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది

బైక్‎ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

నల్గొండ: శాలిగౌరారం మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వంగమర్తి సమీపంలో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతులు నాగారం మండలం నర్సింహుల గూడెం వాసులు సాయమ్మ(70), అవిలయ్య (48)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more