ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-03-05T12:04:27+05:30 IST

ములుగు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్ మండలంలోని జవహార్‎నగర్ దగ్గర ఆటో-డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

ములుగు: ములుగు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్ మండలంలోని జవహార్‎నగర్ దగ్గర ఆటో-డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెంకటాపురం మండలం ఎర్రిగట్టమ్మ వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more