రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలపై పెరుగుతున్న ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-05-24T09:54:40+05:30 IST

రెస్టారెంట్లలో వినియోగదారులు బలవంతంగా సర్వీసు చార్జీలను చెల్లించాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది.

రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలపై పెరుగుతున్న ఫిర్యాదులు

న్యూఢిల్లీ, మే 23: రెస్టారెంట్లలో వినియోగదారులు బలవంతంగా సర్వీసు చార్జీలను చెల్లించాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఈ అంశంపై చర్చించడానికి జూన్‌ 2న నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ)తో సమావేశానికి పిలుపునిచ్చింది. నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌లో వినియోగదారులు నమోదు చేసిన ఫిర్యాదులతోపాటు మీడియా కథనాలు మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లడంతో ఈ భేటీ జరగనుంది.

Read more