కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-03-03T22:21:31+05:30 IST

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఐఎఎస్, ఐపీఎస్‌ల పోస్టింగ్‌లపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, పరిపాలనలో మేధావి వర్గం భాగస్వామి అవుతుందని ఆశించామన్నారు. కానీ ఎనిమిదేళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామన్నారు. కీలకమైన శాఖలు బీహార్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు, అధికారులు బీహారీలేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాదరణకు గురవుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్,139 మంది ఐపీఎస్‌లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డీజీపీ పదవులు కూడా బీహార్ అధికారులకే ఇచ్చారన్నారు. బీహార్ అధికారులకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎండీఏ, రేరాలకు సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జయేశ్ రంజన్ సారథ్యంలో టీఏస్‌ఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరిపించాలని ఆ లేఖలో ఆయన కోరారు. 


Updated Date - 2022-03-03T22:21:31+05:30 IST