తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ప్రమాదంలో పడింది: భట్టి

ABN , First Publish Date - 2022-03-05T23:46:48+05:30 IST

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ప్రమాదంలో పడింది: భట్టి

హైదరాబాద్: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి పోర్టల్‌ లోపాలే జంట హత్యలకు మూలకారణమని ఆరోపించారు. బడ్జెట్‌లో దళితులు, గిరిజనుల కోసం చట్టప్రకారం నిధులు కేటాయించాలని భట్టి డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఒకమాట, ఢిల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు. మంత్రిపైనే హత్యకు కుట్ర జరిగిందంటే.. సామాన్యుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. సీడ్ కంపెనీలతో లాలూచీ వల్లే నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవట్లేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Updated Date - 2022-03-05T23:46:48+05:30 IST