Revanth Apology: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ బహిరంగ క్షమాపణ
ABN , First Publish Date - 2022-08-13T16:05:01+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy)కి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) బహిరంగ క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki dayakar) బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు. ట్విట్టర్‌లో క్షమాపణ వీడియోను రేవంత్ పోస్ట్ చేశారు. ఇలాంటి భాష... ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు.