ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి PV : Revanth

ABN , First Publish Date - 2022-06-28T17:59:38+05:30 IST

భారత్ ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే(PV Narasimha Rao) కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి PV : Revanth

Hyderabad : భారత్ ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే(PV Narasimha Rao) కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. నేడు పీవీ జయంతి సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భూ సంస్కరణలు తెచ్చి.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన సేవలు మరవలేనివన్నారు. దివంగత జైపాల్ రెడ్డి(Jaipal Reddy).. పీవీ అడుగుల్లో నడిచారన్నారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తిగా జరిగాయని తెలుస్తోందన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రేవంత్ పేర్కొన్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-28T17:59:38+05:30 IST